సీఎం రేవంత్ వద్దనున్న టీపీసీసీ పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారనే సస్పెన్స్‌కు తెరపడింది. తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నేత బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. అన్నీ అనుకున్నట్టు జరిగితే శుక్రవారం రాత్రి లేదా, శనివారం సాయంత్రానికి అనౌన్స్‌మెంట్ వచ్చేస్తుందని టి కాంగ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ పర్యటనలో రేవంత్ బిజీ బీజీ..!
మంత్రివర్గ కూర్పుపై చర్చ..?
హస్తిన పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి అటు కేంద్ర పెద్దలతోనూ, ఇటు పార్టీకి సంబంధించి ఏఐసీసీ నేతలతోనూ సమావేశమయ్యారు. ఏఐసీసీ పెద్దలతో సుమారు గంటన్నరపాటు చర్చించిన ఈ సమావేశంలో పీసీసీపై పూర్తి క్లారిటీ వచ్చేసిందని, మహేశ్ పేరే ఫైనల్ అయిపోయిందని తెలియరాగా…మరోవైపు ఇదే మీటింగ్‌లో ఎప్పటినుంచో నాన్చుతూ వస్తోన్న మంత్రివర్గ విస్తరణపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.