ఖండనే కాదు…కంప్లైంట్ కూడా..?
వేణుస్వామిపై మూర్తి ఫిర్యాదు..!
వేణుస్వామి దంపతులు తనపై చేసిన ఆరోపణలను ఖండించడమే కాదు…కంప్లైంట్ కూడా చేశారు జర్నలిస్ట్ మూర్తి. తన నిజాయతీని కించపరిచేలా ఆరోపణలు చేశారని, తన చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారని వేణుస్వామిపై కంప్లైంట్ చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు ఫైల్ అయింది. చేయని నేరానికి తనపై నిందలు మోపిన జ్యోతిష్యుడు వేణుస్వామి దంపతులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ మూర్తి తాను ఇచ్చిన కంప్లైంట్‌లో పేర్కొన్నారు. తానెప్పుడూ ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదని, తనకు ఆ అవసరం లేదని…ఒకవేళ వేణుస్వామి దంపతులు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలుంటే ఏ శిక్షకు అయినా సిద్ధమన్న మూర్తి…ఈ ఘటనపై పూర్తి విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.
చదవండి: “బలగం” వేణుతో సినిమా – నాని రియాక్షన్ ఇదే
మూర్తిపై వేణు ఆరోపణలు ఇవీ..!
టీవీ5 మూర్తి, కొందరు జర్నలిస్టులు తమ నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి, ఆయన భార్య వీణ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జర్నలిస్టు మూర్తి వారి ఆరోపణలు ఖండించడం, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని పోలీసులను ఆయన కోరడం జరిగాయి.