ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఆరోపణలను జర్నలిస్ట్ మూర్తి ఖండించారు. ఆయన ఆరోపణలు నిజమని తేలితే తనను కొట్టిచంపండని, సాక్ష్యం లేకపోతే వేణుస్వామిని ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పండని హితవు పలికారు. తాను వేణుస్వామిని రూ.5 కోట్లు అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు జర్నలిస్ట్ మూర్తి. తన 30 ఏళ్ల జర్నలిజంలో ఏ ఒక్కరినీ రూపాయి అడగలేదన్న మూర్తి…
ఉమ్మడి APలో గవర్నర్ ND తివారీ స్టోరీని బయటపెట్టింది తానేనని… అలాంటి హై ప్రొఫైల్ కేసులోనే డబ్బులకు లొంగని నేను నిన్ను అడుగుతానా వేణుస్వామి అంటూ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.
వేణుస్వామి బాధేంటి..? ఆయన ఏమన్నారు..?
అందరి జాతకాలు ఇట్టే చెప్పగలిగే వేణుస్వామికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. తమకు చావే శరణ్యమని వేణుస్వామి దంపతులు రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తమను 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని 2017 నుంచి నేటివరకు జర్నలిస్ట్ మూర్తి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని…అంతడబ్బు మా దగ్గర లేదంటే, చివరికి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇక తమకు చావే దిక్కంటూ తమ ఆక్రందన వెల్లిబుచ్చుతూ జర్నలిస్టు మూర్తిపై ఆరోపణలు గుప్పించారు.
జర్నలిస్ట్ మూర్తి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని…అంతడబ్బు మా దగ్గర లేదంటే, చివరికి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇక తమకు చావే దిక్కంటూ తమ ఆక్రందన వెల్లిబుచ్చుతూ జర్నలిస్టు మూర్తిపై ఆరోపణలు గుప్పించారు. వేణు స్వామి, అతని భార్య శ్రీవాణి తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితం అని చెప్పారు . అంతేకాకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేసారని వేణు స్వామి మీద జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కంప్లైట్ చేసారు జర్నలిస్ట్ మూర్తి.