AP DGP ద్వారక తిరుమలరావు, పుదుచ్చేరి DGP శ్రీనివాస్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు.వీరిద్దరూ గుంటూరులోని కృష్ణానగర్ ప్రైమరీ స్కూల్, శ్రీ పాటిబండ్ల శీతారామయ్య హైస్కూల్లో చదువుకున్నారు. HCUలో PG పూర్తి చేశారు.
ఆ తర్వాత సివిల్స్ రాసి తిరుమల రావు ఏపీ, శ్రీనివాస్ జమ్మూ కశ్మీర్ కేడర్కు వెళ్లారు.వీరిద్దరూ ఒకే సమయంలో రెండు రాష్ట్రాలకు DGPలుగా ఎంపిక కావడంతో వారి మిత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.