కోల్‌కతా ఆర్జీ కార్ మెడికో హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు సంజయ్‌రాయ్‌కు లై డిటెక్షన్ టెస్ట్ చేసేందుకు ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులకు హైకోర్టు ఓకే చెప్పింది. విచారణలో భాగంగా నిందితుడు పూటకో మాట చెబుతుండటంపై…నిజనిర్థారణ కోసం అతనికి పాలిగ్రాఫ్ చేయాలని, ఇందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అంగీకరించింది. మరి ఈ లై డిటెక్షన్ టెస్ట్ చేస్తే విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో అన్నది వేచిచూడాలి.
కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీం
20న విచారించనున్న ధర్మాసనం
కోల్‌కతా ఆర్జీ కార్ దవాఖాన మెడికల్ కాలేజీ వైద్యురాలిపై లైంగికదాడి, హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ నెల 20న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని బెంచ్ విచారించనుంది. ఒకవైపు దేశవ్యాప్త నిరసనలు, మరొకవైపు హెల్త్ కేర్ సర్వీసుల నిలిపివేత నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.