దాదాపు 9 నెలల తర్వాత యువతి మిస్సింగ్ కేసును ఛేదించారు విజయవాడ పోలీసులు. తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ కి భీమవరంకు చెందిన శివ కుమారి ఫిర్యాదు చేసింది. యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో సీఐతో స్వయంగా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
ఈ నేపథ్యంలో విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి ఇద్దరినీ స్పెషల్ టీం విజయవాడకు తీసుకొస్తోంది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై నగర పోలీసు కమిషనర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.