కోల్‌కతా ఆర్జీ కార్ మెడికో హత్యాచార ఘటనపై X వేదికగా స్పందించారు ప్రముఖ నటి విజయశాంతి. ఘటన జరిగి పది రోజులు కావొస్తున్నా దోషులకు ఇంకా శిక్ష పడలేదు. నాలా ఎంతమంది గొంతు చించుకున్నా, ఎందరెందరో నిరసనలు చేసినా ఈ నేరాలు, ఘోరాలకు అడ్డుకట్ట పడటంలేదన్నదే నా ఆవేదనంతా. ఇలాంటి హత్యాచార ఘటనల పరిస్థితులు, పరిణామాలపై నేను సంఘర్షణ పడుతూనే ఉంటాను. కుటుంబం, సమాజాం, పోలీస్ మరియు న్యాయవ్యవస్థ ఉన్నా కూడా…తప్పో, ఒప్పో చివరికి ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నా కూడా ఈ దారుణాలు ఆగకపోవడం నిజంగా బాధాకరమన్నారు విజయశాంతి.
న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్న రాములమ్మ
Xలో ‘ప్రతిఘటన’ వీడియో పోస్ట్
అభయ ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు …దోషులను వదిలిపెట్టదన్నారు విజయశాంతి. నాకు న్యాయవ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉందన్నారు రాములమ్మ.
నేర విచారణ, దోషులకు శిక్షలకంటే, ముందు అసలు ఇలాంటి దారుణలకు పూర్తిగా అడ్డుకట్టపడాలన్నదే తన బలమైన కాంక్షంటూ…తాను నటించిన ప్రతిఘటన మూవీలోని ఓ సాంగ్‌ను X వేదిక పోస్ట్ చేశారు విజయశాంతి.