నిన్నటి వరకు పీలా గోవింద్ పేరు.. ఇప్పుడు బైరా దిలీప్.. ఇద్దరిలో టీడీపీ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు? టీడీపీ పార్టీ తరపున విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. బైరా దిలీప్ చక్రవర్తిని తమ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దిలీప్ అభ్యర్థిత్వానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మద్దతు తెలుపినట్లు తెలుస్తోంది. కాగా గత పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ను దిలీప్ కు ఇస్తారని ప్రచారం జరిగింది. నిన్నటి వరకు పీలా గోవింద్ పేరు వినిపించింది. ఇప్పుడు ఒక్కసారిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు తెర పైకి వచ్చింది…