మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రధాని స్పందించారు. ఆడవాళ్లపై నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామని, వదిలిపెట్టేదే లేదని స్పష్టంచేశారు. మహారాష్ట్రలోని జలగావ్‌లో జరిగిన ‘లఖ్‌పతి దీదీస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన…మహిళలపై నేరాలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠిన చట్టలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఇటీవల కోల్‌కతా అభయ హత్యాచార ఘటన మరవకముందే బద్లాపూర్ ఘటన మహారాష్ట్రను అట్టుడికేలా చేసిన వేళ.. ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
చదవండి: రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్..? ఒత్తిళ్లకు తలొగ్గేదే లే..!
మహిళలతో మోదీ ముఖాముఖి..!
లఖ్‌పతి దీదీస్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ…ఏటా లక్ష రూపాయలు ఆదాయం పొందుతున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళలతో మోదీ ముఖాముఖి చర్చించారు. కార్యక్రమంలో భాగంగా 11 మందిని సన్మానించారు. రూ.5వేల కోట్ల బ్యాంకు రుణాలను ఈ సందర్భంగా పంపిణీ చేశారు ప్రధాని. కాగా, మూడుకోట్ల మందిని లఖ్‌పతి దీదీలుగా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పీఎంవో వర్గాల సమాచారం.