కూటమి సర్కార్ వచ్చాక ఏపీలో నామినేటెడ్ పోస్టుల హంగామా మొదలైంది.
ఇందులో కీలకమైన కాపు కార్పొరేషన్ పదవిని దక్కించుకునేందుకు నేతలు తీవ్రంగా పోటీపడుతున్నారు.
ప్రధానంగా దివంగత నేత, మాజీ స్పీకర్ బాలయోగి ప్రధాన అనుచరుడు ఆకుల రామకృష్ణ పేరు వినిపిస్తోంది.
ఎంపీ గంటి హరీష్ మాధుర్, రాష్ట్ర మంత్రి సుభాష్, రెడ్డి సుబ్రమణ్యం, యనమల రామకృష్ణుడు,…
నిమ్మకాయల చినరాజప్పలు ఆశీస్సుల కూడా ఉండటంతో తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు రామకృష్ణ.
2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ పుట్టుకొచ్చింది.
ఈ కార్పొరేషన్ ద్వారా కాపులకు ఆర్థిక సాయం, రుణాలు, నైపుణ్య శిక్షణ అందించడం ప్రధాన ఉద్దేశం.
ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా కాపు కార్పొరేషన్ ఛైర్మన్లు కేటాయించి చేతులు దులుపుకుంది తప్ప…
ఎక్కడా కూడా కాపు కార్పొరేషన్ కు నిధులు విదిల్చింది ఏమీ లేదనే మాట మూటగట్టకున్నారు జగన్.
కాగా, పథకాల రూపంలో కాపులకు కొన్ని వేల కోట్లు ఇచ్చామన్నది వైఎస్ఆర్సీపీ వాదన.
ఏ పార్టీ నేతకు దక్కుతుందో…?
ఇక, తాజాగా టీడీపీ కూటమి అధికారంలోకి రాగా ఈ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి గట్టి డిమాండ్ ఏర్పడింది.
అందుకే నేతలు ఎవరికివారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం సంకీర్ణ సర్కార్ నడుస్తోంది కాబట్టి టీడీపీలో ఉన్న కాపులు, జనసేన నుంచి ఆశిస్తున్న కాపునేతలు…
చివరికి, బీజేపీ కూడా ఆ పదవి కావాలని డిమాండ్ చేస్తే…
రెండేళ్ల పదవీకాలంతో కూడిన కాపు కార్పొషన్ గిరి ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.