భర్త మర్మంగాన్ని కోసి పరారైన భార్య..?
భర్త వేధింపులు తాళలేక అతని మర్మంగాన్ని భార్య కోసేయడం ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారింది. గాయపడ్డ భర్తని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు పోలీసులు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.
చదవండి: తెలంగాణ పార్టీపైనే ఇప్పుడు బాబు ఫోకస్..?
సీత కోసం గాలింపు..?
బీహార్‌కు చెందిన విజయ్ యాదవ్ కొంతకాలంగా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో ఓ పశువుల డెయిరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అప్పటికే పెళ్లిఅయిన విజయ్ యాదవ్ తన భార్యను బీహార్‌లోని సొంత ఊరిలో ఉంచేసి… పశువుల డెయిరీ ఫామ్‌లో తనతోపాటు పనిచేస్తున్న సీతాకుమారి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కాగా, ఈమెది కూడా బీహార్ రాష్ట్రమే. సీతాకుమారితో వివాహేతర సంబంధమేకాదు, భార్యగా అంగీకరించి రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆమె ఇటీవల గర్భం దాల్చడం…విజయ్ ఏమీ పట్టించుకోకుండా తరచూ తాగివచ్చి గొడవపడటంతో సీతాకుమారి విసుగుచెందిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ రోజు మద్యంమత్తులో ఉన్న విజయ్ మర్మంగాన్ని కోసి, ఆ విషయాన్ని సదరు డెయిరీ ఫామ్ యజమానికి చెప్పి పరారైపోయిందని పోలీసులు చెబుతున్నారు. కాగా, నిందితురాలి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.