TGSRTC బస్సులో ఓ ప్రయాణికురాలికి ఉన్నపళంగ పురిటినొప్పులు రావడంతో మహిళా కండక్టర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి పురుడు పోశారు. కాగా, అదే బస్సులో నర్సుకూడా ప్రయాణించడంతో పురుడు పోయడం మరింత సులభతరమయింది. అనంతరం దగ్గరలోని స్థానిక ఆస్పత్రికి తరలించి తల్లీబిడ్డను కాపాడారు.
మహిళా కండక్టర్‌పై ప్రశంసలు..!
మానవత్వానికి ప్రతీకంటూ పొగడ్తలు..!
గద్వాల డిపోకు చెందిన గద్వాల-వనపర్తి పల్లె వెలుగు బస్సులో గర్భిణి సంధ్య తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది. కాగా, కండక్టర్ భారతి తీసుకున్న చొరవకు సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆర్టీసీ అధికారులు సైతం ఆమె సహృదయాన్ని మెచ్చుకుని సకాలంలో మంచిపని చేశావమ్మ అని కొనియాడుతున్నారట.