మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ తాఖీదులు అందుకున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ కేటీఆర్‌కు నోటీసులు జారీచేసింది. ఈ నెల 24న కమిషన్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది రాష్ట్ర మహిళా కమిషన్.
అసలు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏంటి?
ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే మహిళలు బ్రేక్ డాన్స్‌లు, రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చంటూ కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కుట్లు, అల్లికలే కాదు..అవసరమైతే డాన్సులు కూడా చేసుకోండని అవమానకరంగా మాట్లాడారు. తామేమీ తప్పుగా అనడం లేదని…అవసరమైతే బస్సులు పెంచి ఒక్కొక్కరికి ఒక్కో బస్సు కేటాయించండని హేళనగా మాట్లాడారు. ఆగస్టు 15 సందర్భంగా పార్టీ శ్రేణుల సమావేశంలో కేటీఆర్ నోరుజారడంతో మహిళా కాంగ్రెస్ భగ్గుమంది.
చదవండి: జాతీయ అవార్డును ముద్దాడిన కార్తీకేయ-2
సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్
ఇదిలాఉంటే తాను చేసిన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించినవి కాదని…యథాలాపంగా మాట్లాడానే తప్ప, మహిళలను కించపరించే ఉద్దేశం తనకెక్కడా లేదని ఎక్స్ వేదికగా ఈరోజు మహిళలకు క్షమాపణ చెప్పారు. అయితే, అప్పటికే కేసును సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీచేసి 24న తన ముందు హాజరుకావాలని ఆదేశించింది.