ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేస్తే అదే వాళ్లకి చివరి రోజు..?
శాంతి భద్రతలపై రాజీలేదన్న చంద్రబాబు..!
నేరం చేస్తే శిక్ష తప్పదు అన్న భయం కనిపించేలా పోలీసు శాఖ పనిచేయాలని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రజల భద్రతకు భరోసా ఇచ్చేలా పోలీస్ శాఖ పనిచేయాలన్న ఆయన…రాజకీయ ముసుగుల్లో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలన్నారు. నేరస్థులకు శిక్షల విషయంలో ఫలితాలు కనిపించేలా అధికారులు పనిచేయాలని సూచించారు చంద్రబాబు. మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలి.. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అనేది నేరస్తులకు అర్థం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. హోంశాఖపై సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి సమావేశానికి..ఆ శాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావుతోపాటు పోలీసుశాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చదవండి: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.
జగన్ హయాంలో పెరిగిన క్రైమ్‌రేట్..?
చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్..!
విభజిత ఏపీలో గడిచిన ఐదేళ్ల జగన్ పాలనలో 46శాతం నేరాలు పెరిగాయని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గణాంకాలతోసహా వివరించారు చంద్రబాబు. మహిళలపై నేరాలు, ఆడవాళ్ల అదృశ్యం కేసులు, సైబర్ నేరాలు, గంజాయి&డ్రగ్స్ కేసులు, చిన్న పిల్లలపై నేరాలు..ఇలా ఒక్కో అంశానికి సంబంధించి క్రైమ్ రేట్ ఎంత పెరిగిందో శాతాలవారీగా చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు…గత ప్రభుత్వ తీరుతో పోలీస్‌శాఖ ఎలా నిర్వర్యమైపోయిందో వీటిని బట్టి చూస్తే తెలుస్తుందని హోంశాఖ సమీక్షలో పోలీసుశాఖ అధికారులపై ఒకింత అసహనం వ్యక్తంచేశారు.