వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కెమేరా చేతపట్టి స్వయంగా ఫోటో జర్నలిస్టును ఫోటోలు తీసి ఆ క్షణాన నవ్వులు పూయించారు. ఫొటో జర్నలిస్టులతో కాసేపు ముచ్చటించారు.
చంద్రబాబు ఆప్యాయ పలకరింపు
ఫోటో జర్నలిస్టుల కష్టాలపై స్పందన
ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సిఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో ఉన్న కెమేరాను తీసుకున్న సీఎం చంద్రబాబు స్వయంగా క్లిక్ మనిపించారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమన్న చంద్రబాబు ఈ రంగంలో ప్రతిభ చూపుతున్న వారిని అభినందించారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేస్తున్న సీనియర్ ఫోటో జర్నలిస్టులు చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారు.