దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..

Spread the love

వైసీపీ మాజీ మంత్రికి హైకోర్టులో ఎదురుదెబ్బ..!
దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..!

తుని వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విలేకరి హత్యకేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టేసింది. మంగళవారం పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. మాజీ మంత్రి పిటిషన్‌ను తోసిపుచ్చింది.

తుని నియోజకవర్గం తొండంగి ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణ 2019 అక్టోబర్ 15న హత్యకు గురయ్యారు. ఎస్.అన్నవరంలోని తన నివాసానికి వెళుతున్న సత్యనారాయణను లక్ష్మీదేవి చెరువుగట్టుపై దుండగులు అడ్డగించి, కత్తులతో నరికి చంపారు.

ఈ హత్యకు సూత్రధారి వైసీపీ నేత దాడిశెట్టి రాజానేనని బాధిత కుటుంబం ఆరోపణ. వారి ఫిర్యాదు మేరకు తుని రూరల్ పోలీసులు రాజాతోపాటు ఆరుగురిని నిందితులుగా చేర్చి కేసు ఫైల్ చేశారు. అయితే, రాజా మంత్రి అయ్యాక విలేకరి హత్యకేసు తెరమరుగైపోయింది. 2023లో మంత్రి పేరును చార్జిషీట్‌లోనూ తొలగించారు.

అయితే హతుడు సత్యనారాయణ సోదరుడు, న్యాయవాది కాతా గోపాలకృష్ణ పట్టు వదల్లేదు.
దాడిశెట్టి రాజాను శిక్షించి తమకు న్యాయం చేయాలని యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేశ్‌ను అభ్యర్థించారు. ఆ మేరకు లోకేశ్‌ కూడా హామీ ఇవ్వడంతో… కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై పోలీసులు కేసు నమోదు చేయడం…దీంతో ముందస్తు బెయిల్‌కు ఆయన పరుగులు తీయడం జరిగిపోయాయి.

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...