రాష్ట్రంలో రాఖీ సంబురం ఇంటింటా వెల్లివెరిసినా…మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో మాత్రం కూతురు లేని లోటు కనిపిస్తోంది. రాఖీ వేళ ఎప్పుడూ కూడా కేసీఆర్ కుటుంబంలో సందడి వాతావరణం కనిపించేది. ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి కేటీఆర్ ఎప్పుడు రాఖీ పండగ వచ్చినా వీరిద్దరూ ఆరోజు ప్రత్యేకంగా వార్తల్లో ఉండేవారు. కేటీఆర్‌కు కవిత రాఖీ కడుతున్న ఫొటోలతో వార్తలు తెగవైరల్ అయ్యేవి. మెయిన్ స్ట్రీమ్‌లోనూ, అలాగే సోషల్ మీడియాలోనూ తెగచక్కర్లు కొట్టేవి.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కొన్నాళ్లుగా జైలుజీవితం గడపడంతో సోదరి కవిత కట్టే రాఖీకి కేటీఆర్ ఈసారి దూరమైపోయారు.
చేతులు నిండా రాఖీలతో కేటీఆర్..!
కవితను ఉద్దేశిస్తూ కేటీఆర్ ఉద్విగ్న ట్వీట్..!
చెల్లెలు కవిత తప్ప పార్టీలోని మహిళలందరూ కట్టిన రాఖీలతో మాజీ మంత్రి కేటీఆర్ చేతులు నిండిపోయాయి. పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు రాఖీలు చూసుకున్న కేటీఆర్.. ఇంకా, ఎక్కడో తెలియని లోటు కనిపిస్తుంది అనుకున్నారేమో…వెంటనే ఓ ఉద్విగ్నభరితమైన ట్వీట్ చేశారు. ఈసారి నీకు రాఖీ కట్టలేకపోవచ్చు…కానీ, ప్రతి కష్టంలోనూ నీ వెంటే ఉంటానంటూ, కవితపై తనకున్న ప్రేమను చాటుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్.