రీల్స్ కోసం బైక్ పై స్టంట్స్ చేయడంతో అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ సమీపంలో శనివారం సాయంత్రం జాతీయ రహదారిపై వర్షంలో రీల్స్ కోసం బైక్ పై ఇద్దరు యువకులు స్టంట్స్ చేశారు. దీంతో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో శివ అనే యువకుడు మృతి చెందగా..
డ్రైవింగ్ చేస్తున్న యువకుడికి తీవ్ర గాయలయ్యాయి. స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది