మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో గత శనివారం అర్ధరాత్రి టీడీపీ మూకల చేతిలో దారుణహత్యకు గురైన వైయస్సార్‌సీపీ నాయకుడు పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతి భద్రతలు, రెండు నెలలుగా కొనసాగుతున్న దారుణ పరిస్థితి, జరుగుతున్న హత్యలు, హత్యా యత్నాలు, దాడులను.. మరోసారి యావత్ దేశం దృష్టికి తీసుకుపోనున్నట్లు వైయస్ జగన్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం నవాబ్‌పేటలో టీడీపీ మూకల చేతిలో తీవ్రంగా గాయపడి, విజయవాడ సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ నాయకులు శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణను పరామర్శించిన అనంతరం, అక్కడే మీడియాతో మాట్లాడిన వైయస్ జగన్ ఈ విషయాలు వెల్లడించారు.