వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత & మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. వైయస్ జగన్ తో పాటు ఢిల్లీ వెళ్లిన ఉమ్మడి కృష్ణాజిల్లా శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఉన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
చదవండి: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆరోగ్యవర్సిటీ పేరు మార్పు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
రేపు ఢిల్లీలో జరిగే ధర్నాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ ధర్నాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం అరాచకాలకు నిరసనగా రేపు ఢిల్లీలో ధర్నా…