నెల్లూరు సెంట్రల్ జైలులో పిన్నెల్లిని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. జగన్ మీడియాతో మాట్లాడుతూ – చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి. సీఎం చంద్రబాబుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరిక చేస్తున్నాం. ఎల్లకాలం రోజులు మీవేం కావు. దాడుల సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ కూడా ఉంటుంది. ఓవైపు విధ్వంసం, దాడులు చేస్తూ తిరిగి తప్పుడు కేసులుపెట్టడం ఏంటి. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్కులు చూపిస్తూ విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఓటు వేయలేదన్న కారణంతో దాడులు చేస్తున్నారు, ఆస్తులకు నష్టం చేకూరుస్తున్నారు. చంద్రబాబు కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలి. భయాందోళనలతో నడిపే రాజకీయాలు తాత్కాలికం. చంద్రబాబు తీసుకొచ్చిన తప్పుడు సంప్రదాయం.. ఒక బీజంలా ఇవాళ నాటుకుంది. అది రేపు చెట్టవుతుంది. టీడీపీ కార్యకర్తలు, నాయకులు కూడా ఇలాంటి పరిస్థితులనే చూడాల్సి వస్తుంది. నాయకులుగా ఉండేవారు తప్పును, తప్పుగా చెప్పాలి. ఆస్తులు ధ్వంసం చేస్తూ, మనుషులను కొడుతూ దౌర్జన్యాలు చేస్తున్నా పోలీసుల ప్రేక్షక పాత్ర
– ఎన్నికల్లోఇచ్చిన హామీలు అమలు, పరిపాలనపై దృష్టిపెట్టండి. తల్లికి వందనం, రైతు భరోసా, ఆడబిడ్డలకు రూ.1500 ఇవ్వడంపై దృష్టి పెట్టండి. చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేలా హామీలు ఇచ్చారు. అని అన్నారు.
చంద్రబాబును వదిలిపెట్టం – వైఎస్ జగన్
Popular Categories