2024 ఎన్నికల్లో ఘోర ఓటమి బాధలో ఉన్న వైసీపీ పార్టీకి మరో షాక్ ఇచ్చిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. వైసీపీ పార్టీకి రాజీనామా చేసేందుకు ఈ నేత సిద్దం అయ్యారు. రేపు వైసిపికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేయనున్నారట.
దీనిపై ఆయన అనుచరులకు క్లారిటీ ఇచ్చారట. త్వరలో ఆయన జనసేనలో చేరనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో దొరబాబును కాదని వంగా గీతకు వైసిపి టికెట్ ఇచ్చారు జగన్. అప్పటి నుంచి దొరబాబు వైసీపీ పార్టీ పై అసంతృప్తిగానే ఉన్నారట.