వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఇంటిపై దాడికేసులో మాజీ మంత్రి జోగిరమేష్‌కు తిప్పలు తప్పేలా లేవు. అయితే ఈ కేసులో ఇదివరకే జోగిరమేష్‌ను విచారణకు పిలిపించి గంటన్నరపాటు ఇంటరాగేట్ చేసి పంపించగా..తాజాగో మరోసారి నోటీసులు ఇచ్చి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి పీఎస్ వద్దకు రావాలని ఆదేశాలిచ్చారు. అయితే వారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ కేవలం తన తరఫున లాయర్లను మాత్రమే పంపించి పత్తాలేకుండా పోయారు జోగిరమేష్.
అరెస్ట్‌కు భయపడే అజ్ఞాతంలోకి…
మాజీమంత్రి జోగిపై వార్తలే వార్తేలు…
అంబాపురం అగ్రిగోల్డ్ భూముల స్కామ్ కేసులో ఇప్పటికే తన తనయుడు రాజీవ్‌ను అరెస్ట్ చేయగా…ఇదంతా రాజకీయ కక్షంటూ తన ఆవేశాన్ని వెళ్లగక్కారు మాజీ మంత్రి జోగిరమేష్.
అందరూ ఎలాగైతే కొన్నారో…తామూ అలానే కొన్నామంటూ మాట్లాడారు కూడా. అయితే ఈ కేసులోనూ జోగిని విచారించే అవకాశలు ఉన్నాయని, ఇప్పటికే చంద్రబాబు ఇంటిపై దాడికేసుతోపాటు ఈ కేసులోనూ విచారించి వదిలిపెట్టిన అధికారులు…నేరం రుజువైతే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న వేళ… నేటి విచారణకు జోగిరమేష్ గైర్హాజరు అవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది.