గవర్నర్ అబ్దుల్ నజీర్ ను వైఎస్ఆర్ సీపీ నేతలు కలిశారు. రాష్ట్రంలో అరాచకం నెలకొంది, తక్షణమే దాడులు ఆపాలని వారు గవర్నర్ కు లేఖ అందించారు. రాజకీయ దాడుల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిందిగా కోరామని వైసీపీ నేతలు అన్నారు. గవర్నర్ ను కలిసివారిలో వైయస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఉన్నారు. వైసీపీ నేతలు గవర్నర్ వద్ద ఈ కింది విషయాలు ప్రస్తావించారు.
· మూడు వారాలుగా రాష్ట్రంలో టీడీపీ, జనసేన శ్రేణుల విధ్వంసం
· ప్రభుత్వ భవనాలపైనా దాడులకు తెగబడుతున్నారు
· శాంతిభద్రతలు క్షీణించినా పోలీసులు చోద్యం చూస్తున్నారు
· నిబంధనల ప్రకారం పార్టీ ఆఫీసులు కట్టుకుంటున్నా దుష్ప్రచారం తగదు
– మా పార్టీ కార్యాలయాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు
– వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని హింస, బెదిరింపులకు పాల్పడుతున్నారు
– మా పార్టీ ఆస్తులపై దాడులు, వ్యక్తులపై భౌతిక దాడులు జరుగుతున్నాయి
– రాష్ట్రమంతటా అస్ధిర వాతావరణం నెలకొంది
టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోంది
· కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై సీఎం చంద్రబాబు స్పందించాలి
– తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన సాగేలా చూడాలని కోరుతున్నాం.