రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో “సేవ్ డెమోక్రసీ” నినాదాలతో అసెంబ్లీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు, మండలి సభ్యులు వచ్చారు.
చదవండి: గతంలో ఏం చేశావో గుర్తుచేసుకో జగన్ – హోం మంత్రి అనిత
నిరసనలో ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. “ప్రజాస్వామ్యాన్ని కాపాడండి” అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల చేతుల్లోని పేపర్లను లాక్కొని పోలీసులు చింపివేశారు. పోలీసుల తీరుపై చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.