తాడేపల్లి గూడెంలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ కార్యాలయాన్ని ఈ ఉదయం అధికారులు కూల్చివేశారు. ఈ భవనం కూల్చివేయద్దంటూ హైకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నా బేకాతరు చేస్తూ అధికారులు ఉదయం 5.30 గంటల నుంచి ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేశారు. ఈ బిల్డింగ్ శ్లాబ్ వేసేందుకు సిద్ధంగా ఉంది.
కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ నిన్న హైకోర్టును వైఎస్ఆర్ సీపీ నేతలు ఆశ్రయించారు. చట్టాన్ని మీరి వ్యవహరించ వద్దని అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సీఆర్డీయే కమిషనర్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వైయస్సార్‌సీపీ న్యాయవాది అధికారులకు తెలియజేశారు. అయినా హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైయస్సార్‌సీపీ కార్యాలయభవనాన్ని కూల్చివేశారని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వారు చెబుతున్నారు.