ఆయ్‌ మూవీ రివ్యూ

Spread the love

గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌-2పై వచ్చిన ఈ చిత్రం కోనసీమలోని ఒకప్పటి వాస్తవ ఘటనలను ఆధారంగా తీసిన చిత్రంగా చెప్పొచ్చు. రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ..1980, 1990 దశకాలలో ఒకరంటే ఒకరికి పడని వైనం… అమలాపురం టౌన్‌లో మరీ ముఖ్యంగా ఓ థియేటర్‌ సరిహద్దు ప్రాంతంగా జరిగే గొడవలను, నాడు ఎస్‌కెబీఆర్‌ కాలేజీలో కులాలవారీగా జరిగిన యూత్ కొట్లాటలను మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రంద్వారా చూసి ఇది మా చిత్రమే అని ఓన్ చేసుకుంటున్నారు గోదారోళ్లు.

జూనియర్‌ ఎన్టీఆర్ బావమరిది నార్నెనితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి బన్నీవాసు నిర్మాతగా వ్యవహరించగా…రచయతగా ఈ కథను రాసుకుని మెగాఫోన్‌ పట్టిన మణిపుత్రకు ఇది డెబ్యూ. హీరో తండ్రిగా వినోద్‌, హీరోయిన్ తండ్రిగా మైమ్‌ గోపీ తప్ప పెద్దగా క్యాస్టింగ్ ఏమీలేని ఈ సినిమా..గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి పెద్దసినిమాలను పక్కననెట్టి అందరినీ అలరించిందనే చెప్పాలి.

చదవండి: డబుల్ ఇస్మార్ట్‌ మూవీ రివ్యూ

కథ విషయానికి వస్తే…

అమలాపురంలోని ఓ మారుమూల గ్రామం హీరో కార్తీక్‌ ఊరు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని. అయితే కరోనా టైమ్‌లో లాక్‌డౌన్ పుణ్యామా అని వర్క్‌ ఫ్రమ్ హోం పేరుతో ఇంటికి వచ్చిన అతడు…పక్క ఊరికి చెందిన పల్లవి ప్రేమలో పడతాడు. అయితే ఇద్దరి కులాలు వేరు. హీరోది అగ్రకులమైనా ఆర్థికంగా బాగా చితికిపోయిన కుటుంబం. దీనికంతటికీ తన నాన్న బూరయ్య (వినోద్‌) అప్పులు చేసిమరీ ఎదుటివాళ్లని ఆదుకోవడమే ఈ రోజు ఈ స్థితికి కారణంగా మనహీరో… అవకాశం వచ్చినప్పుడల్లా తండ్రిని చీదరించుకుంటాడు. ఒక అసమర్థ తండ్రిగా ఎత్తిచూపుతాడు. ఇక మరో విషయం ఏంటంటే హీరోని ప్రాణం కంటే ప్రేమించిన అమ్మాయి…మా నాన్న (దుర్గ)కి కులపిచ్చి, మన పెళ్లి జరగదు, నీ ప్రాణానికే ప్రమాదమని సింపుల్‌గా చెప్పి దూరంగా ఉంటుంది. దీంతో ఏం చేయాలో తెలియక కార్తీక్ సతమవుతూ ఉంటాడు. చివరిదాకా ఈ లైన్ కంటిన్యూ అవడం…ఎందుకో కొడుకు బాధగా ఉండటాన్ని గమనించిన తండ్రి బూరయ్యకు అతని ప్రేమ విషయం తెలియడంతో…అమ్మాయి తండ్రి దగ్గరకు వెళ్లిన బూరయ్యకు ఎదురైన అనుభవం ఏంటి?..కులాలు వేరైనా చివరికి కార్తీక్‌, పల్లవి ఒక్కటవుతారా?…పల్లవి తండ్రి దుర్గకు అంత కులపిచ్చి ఉన్నా తన కూతురి పెళ్లి విషయంలో చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేదే చిత్ర కథాంశం.

చిత్ర బలాబలాలు
————————

*మ్యాడ్‌తో హిట్‌ కొట్టిన నార్నె నితిన్‌ ఇందులో ఓ మధ్యతరగతి కుర్రాడిలా యాక్ట్ చేసి తన క్యారెక్టర్‌కు న్యాయం చేయడం…

*హీరోయిన్‌ నయన్ సారిక అచ్చమైన గోదారి అమ్మాయిగా, మరీ ముఖ్యంగా హావభావాలతో తన పాత్రకు ప్రాణం పోయడం…

*అటు, ఇటు తండ్రుల పాత్రలు పోషించిన వినోద్‌, మైమ్‌ గోపీ ఈ చిత్రానికి బిగ్గెస్ట్ అస్సెట్ అని చెప్పొచ్చు…

*మరీ ముఖ్యంగా హీరో స్నేహితులుగా చేసిన రాజ్ కుమార్ కసిరెడ్డి , అంకిత్‌ కోయ కామెడీ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఏ సీన్‌లో ఆ ఇద్దరు కలిసినా పొట్టచెక్కలే…

*అసలే గోదావరి…ప్రకృతి అందాలకు పెట్టింది పేరు..ప్రతి ఫ్రేమ్‌ చక్కగా పచ్చటి పెరటిలో తీసినట్టు ఉంటుంది…సో విజువల్లీ అన్ని ఫ్రేమ్స్ కూడా సూపర్‌….

*డీవోపీ అండ్‌ రామ్ మిరియాల, అజయ్‌ అరసాడ మ్యూజిక్‌ హైలెట్‌, నేపథ్య సంగీతం కూడా మరింత ప్లస్ అయింది…

చిత్ర బలహీనతలు
————————-

*ఫస్టాఫ్‌, ద్వితీయార్థంలో కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించినా, ఇక అరగంటలో సినిమాకు ఎండ్ కార్డు పడుతుందనేసరికి ఒక్కసారిగా అందరి క్యారెక్టర్‌లో, మరీ ముఖ్యంగా బూరయ్య, గోపీల క్యారెక్టర్లను ఎలివేట్‌ చేసి…భావోద్వేగాలను పీక్స్‌కు తీసుకెళ్లి ఈ ఏడాది ఆగస్టు15 తమదే అనిపించుకునేలా ముగింపు పలకడంతో ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయ్యారు.

(గమనిక – ఈ చిత్రం ప్రేక్షకుల అభిప్రాయాల నుంచి సేకరించింది మాత్రమే)

రేటింగ్ 3/5

Hot this week

అరియానా, వివియానా ఫస్ట్‌లుక్‌ రిలీజ్ .

అరియానా, వివియానా పుట్టిన రోజు సందర్భంగా పాత్రలని పరిచయం చేసిన ‘కన్నప్ప’...

ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్ 20న.

సూపర్ స్టార్ ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్...

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్.

సౌత్ ఇండియన్ సినిమా ఐకాన్ సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ ని...

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు రిలీజ్.

దిల్ రాజు ప్రెజెంట్స్, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, భీమ్స్ సిసిరోలియో, రమణ...

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ కు సుకుమార్ ప్రశంసలు.

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా టీజర్...

Topics

అరియానా, వివియానా ఫస్ట్‌లుక్‌ రిలీజ్ .

అరియానా, వివియానా పుట్టిన రోజు సందర్భంగా పాత్రలని పరిచయం చేసిన ‘కన్నప్ప’...

ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్ 20న.

సూపర్ స్టార్ ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్...

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్.

సౌత్ ఇండియన్ సినిమా ఐకాన్ సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ ని...

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు రిలీజ్.

దిల్ రాజు ప్రెజెంట్స్, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, భీమ్స్ సిసిరోలియో, రమణ...

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ కు సుకుమార్ ప్రశంసలు.

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా టీజర్...

హైదరాబాద్ నడిబొడ్డున పుష్ప వైల్డ్ ఫైర్ జాతర.

హైదరాబాద్ నడిబొడ్డున పుష్ప వైల్డ్ ఫైర్ జాతరఐకాన్ స్టార్ అల్లు అర్జున్...

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ తో ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా క .

మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని...

అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయండి.

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని...