మూవీ : యావరేజ్ స్టూడెంట్ నాని
నిర్మాత : శ్రీ నీలకంఠ మహాదేవ ఎంటర్టైన్మెంట్
మ్యూజిక్ : కార్తీక్
సినిమటోగ్రాఫీ : సజీష్ రాజేంద్రన్
హీరోయిన్స్ : స్నేహ, సాహిబ
రచయిత, నిర్మాత, హీరో, దర్శకుడు: పవన్ కుమార్
ప్రతి శుక్రవారం ఎన్నో సినిమాలు వస్తుంటాయి…ఎవరికీ తెలియకుండా కొన్ని వెళ్లిపోతుంటాయి. కానీ ఈ వారం విడుదలయింది చిన్న సినిమా అయినా…అన్ని వయస్సుల వారిని ఆకట్టుకునే కుటుంబ కథాచిత్రం. అదే ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. హీరోగా నాని పాత్రలో ఒదిగిపోయిన పవన్ కుమార్ కొత్తూరికి ఇది డెబ్యూ. మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన పవన్..ఈ చిత్రాన్ని కూడా తానే డైరెక్ట్ చేయడం మరో విశేషం.
ఆయనే ఈ చిత్ర కథా రచయిత. ఆయనే ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు. ఫైనల్‌గా నిర్మాత కూడా పవనే. ఒకరకంగా చెప్పాలంటే అన్నీ తానై చిత్రయూనిట్‌ను ముందుండి నడిపించాడు. అతనికి తల్లిగా ఝాన్సీ చేసిన నటన నేచురల్‌గా ఉంటుంది. నిజాయతీ గల తండ్రిగా రాజీవ్ కనకాల జీవించారనే చెప్పాలి. కరెంటు తీగ కూడా నాలా సన్నగా ఉంటుంది, కానీ ముట్టుకుంటే షాక్ కొడుతుందనేలా హీరో క్యారెక్టర్‌ను డిజైన్ చేసుకుని మరీ యాక్ట్ చేయడం పవన్‌కుమార్‌కే చెల్లింది. అతని అహార్యం, చేసే స్టంట్స్ తమిళ్ హీరో ధనుష్‌కి దగ్గరగా ఉందనేది వీక్షకుల మాట. విలువలకి, ఆప్యాయతలకి విలువిచ్చే కుటుంబంలో ఓ అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు …జీవితంలో ఎలా స్థిరపడతాడన్నదే చిత్ర సారాంశం. ఇందులో నటించిన ఇద్దరు హీరోయిన్లూ ఎందులోనూ తీసిపోరు. అందాల ఆరబోతతోపాటు నటనలోనూ అదరహో అనిపించారు. ఇందులో హీరో ప్రేమించిన అమ్మాయిగా సారా (స్నేహ) తన సొగసులతో మంత్రముగ్దులను చేస్తే…హీరోని ప్రేమించిన అను (సాహిబ) అయితే మరో హైలెట్. చుక్కల్లాంటి అమ్మాయిలని సెలెక్ట్ చేసిమరీ స్క్రీన్‌కి రిచ్‌నెస్ తీసుకొచ్చారు హీరో కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ పవన్ కుమార్.
చదవండి: లీగల్ గానే లావణ్యను ఎదుర్కొంటా – రాజ్ తరుణ్
శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం PVR ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలోకి రావడం మరో విశేషం. ఈ చిత్ర బలాబలాలు – మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ అందించిన సంగీత బాణీలు, రీరికార్డింగ్…నటనతో, తమ అందాల ఆరబోతతో మత్తెక్కించే హీరోయిన్స్, స్టంట్స్, కథ పాతదైనా కథనంలో కొత్తదనం, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి
*మైనస్ పాయింట్స్
ఝాన్సీ, రాజీవ్ కనకాల తప్ప సీనియర్ యాక్టర్లు ఎవరూ లేకపోవడం
స్క్రీన్‌ప్లేలో దొర్లిన చిన్న చిన్న పొరపాట్లు, ఉన్నపళంగా వచ్చే క్యారెక్టర్లు
ప్లస్ పాయింట్స్
*మొత్తానికి లో బడ్జెట్‌లో వచ్చిన ఈ చిన్న చిత్రానికి వీక్షకుల నుంచి విమర్శల కన్నా ప్రశంసలు రావడం చూస్తుంటే హీరో కమ్ డైరెక్టర్ పవన్ సక్సెస్ సాధించారనే చెప్పొచ్చు.
*సినిమాటోగ్రఫీ
*మ్యూజిక్
*హీరో & డైరెక్టర్
గమనిక – ఇది ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రాసిన రివ్యూ మాత్రమే
రేటింగ్ 3/5