హైడ్ న్ సీక్ మూవీ రివ్యూ..

Spread the love

హైడ్ న్ సీక్ మూవీ రివ్యూ

సెల్‌ఫోన్స్‌, ఇంటర్నెట్ లేకముందు మన సమాజంలో జరిగిన నేరాలు ఒక ఎత్తు…అవి వచ్చాక భిన్నమైన ధోరణిలో జరుగుతున్న క్రైమ్స్‌, చివరికి పోలీసులకే సవాళ్లుగా మారుతున్న కొన్ని కేసులు.. చూస్తే నేటి తరంలో నేరాలు ఘోరాలు తన పంథా మార్చుకున్నది అన్నది సినిమా ఇతివృత్తాంతం. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్తే సినిమా చూసాక మంచి మెసేజ్‌ అయితే ఇచ్చారని అనిపించడం ఖాయం.

బసిరెడ్డి రానా…ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించి కథా రచయిత కూడా. తొలిసారి మెగాఫోన్‌ పట్టి తన ఆలోచనలను తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి.

చైనాతో విభేదాల కారణంగా అవిరూపొందించిన యాప్స్‌ను మనదేశంలో బ్యాన్‌ చేసినవాటిలో పబ్జీ గేమ్‌ కూడా ఒకటి. ఉదాహరణకే చూసుకుంటే అలాంటి గేమ్స్ వల్ల ఇంట్లో పిల్లలు చదువులు మానేసి ఫోన్లలో ఆ గేమ్‌ ఆడుతూ ఎడిక్ట్‌ అయిపోయి చివరికి మానసికరోగులుగా మారిన పరిస్థితులు దేశంలో కోకొల్లలు. భావిభారత పౌరులుగా మారాల్సిన మన నేటితరం అలాంటి విదేశీ యాప్స్ వల్ల వాళ్ల బతుకులు ఛిద్రమైపోతున్నాయి. వారిని కన్న తల్లిదండ్రులకు కడగండ్లు మిగులుస్తున్నాయి.

చదవండి: జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు

అయితే ఈ చిన్న అంశాన్ని పెద్దగా ఎలివేట్‌ చేసి దానికి మోడ్రన్‌ టచ్‌ ఇచ్చి కథ రాసుకున్న మన దర్శకుడు బసిరెడ్డి రానా…దాన్ని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మనదేశంలో చొరబడి ఉగ్రదాడులు చేయాలన్న కసితో ఉన్న పాకిస్తాన్‌….ఓ కొత్త పంథాను ఎంచుకుని మనల్ని మనమే చంపుకునేలా ఎత్తుగడ వేస్తుంది. స్పైడర్ గేమ్ అనే యాప్‌తో లెవల్స్‌ క్రియేట్‌ చేసి ఆటగాళ్లను ఆటగాళ్లే చంపుకోవడం…సినిమాను ఆద్యంతం సస్సెన్స్‌ థ్రిల్లర్‌గా కొనసాగేలా చేసిందనడంలో ఎలాంటి అతిశయెక్తి లేదు.

అయితే కథా పరంగా… జరిగే హత్యలకు హిస్టారికల్‌ టచ్‌ ఇవ్వడం కొత్తగా అనిపిస్తుంది. నాడు నందిరాజ్యంలో జరిగిన మారణకాండకు.. ఈ హత్యలకు ఏంటి సంబంధం..?. మరోవైపు ఎక్కడో పాకిస్తాన్‌ వాళ్లు క్రియేట్ చేసిన యాప్‌ను మనదేశంలో, అదీ కూడా డిపార్ట్‌మెంట్‌లో ఓ ప్రముఖ ఉద్యోగి వాళ్లకు సహకారం అందించిన ఆ విలన్ ఎవరు?.. చివరికి అతని ఆటని మనవాళ్లు ఎలా కట్టిస్తారు..?…మనదేశంలో మారణకాండకు పన్నాగం పన్నిన పాక్‌ యాప్‌ పోగ్రాంను.. మన టెకీస్‌ ఎలా దారిమళ్లిస్తారు అనేది కచ్చితంగా చిత్రంలో చూడాల్సిందే.

హీరో శివ గురించి చెప్పాల్సి వస్తే…కేరింతతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన విశ్వంత్‌కు హైడ్‌ అండ్ సీక్‌ ఒక బ్రేక్‌గా చెప్పొచ్చు. వాస్తవానికి ఈ చిత్రంలో అతని క్యారెక్టర్‌…ఆర్మీలో డాక్టర్‌గా పనిచేయాలన్నకల. కాకుంటే, కాలేజీలో తన తోటి స్నేహితులు… పాక్‌ పన్నాగం పన్నిన యాప్‌ వలలో చిక్కుకుని అంతుచిక్కని విధంగా హత్యలు చేయబడతారు. అయితే తన కలను పక్కను పెట్టి, తన స్నేహితులను ఎవరు చంపుతున్నారు అనేదానిపై కేసును చేధించే విధంగా తనవంతుగా డిటెక్టివ్‌ పాత్ర పోషించి…పోలీసులను అయోమయానికి గురిచేస్తుంటాడు. ఒకానొక టైమ్‌లో శివపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తంచేసి అరెస్ట్ కూడా చేస్తారు. అయితే తనపై పడ్డ నిందను ఎలా పోగొట్టుకున్నాడు, తన స్నేహితులును చంపిన కారకులను ఎలా పసిగట్టాడు అనేది స్క్రీన్‌పైనే చూడాలి.

ఇక పోలీస్ పాత్రలో వైష్ణవిగా శిల్ప మంజునాథ్ నటన అద్భుతమనే చెప్పాలి.
కేసును విచారించే క్రమంలో తను పలికించే భావోద్వేగాలతో సినిమాకు సీరియస్‌నెస్‌ తెప్పించింది. ఈ కథను మొత్తం వైష్ణవి, శివే తమ భుజాలపై మోసి ముందుకు నడిపించారు.

ఏదేమైనా చిన్నసినిమాగా వచ్చిన ఈ మూవీని చిన్నచూపు చూస్తే తక్కువచేసినట్టే. కచ్చితంగా పిల్లలతోపాటు పెద్దలూ చూడాల్సిన సినిమా. నేటితరం బాగుకోసం డైరెక్టర్‌ బసిరెడ్డి రానా రాసుకున్న కథ…చూసినవాళ్ల అందరిలోనూ అవేర్‌నెస్‌ తెప్పించే పెద్ద కంటెంట్‌గా చెప్పకతప్పుదు. అయితే ఈ మధ్యకాలంలో ఎన్నో వందల కోట్లు పెట్టి తీసే సినిమాలు ఒక్క షో కూడా ఆడకుండా, ప్రేక్షకుడిని టచ్‌ చేయకుండా వెళ్లిపోతున్న ఈ పరిస్థితుల్లో…చిన్నబడ్జెట్‌తో పెద్ద హిట్‌ టాక్‌ సంపాదించుకున్న ఈ సినిమా టాలీవుడ్‌ చరిత్రలో చెరగని ముద్రవేసుకుంది అనడంలో ఎలాంటి సందహమే లేదు. కాకుంటే ఈ సినమాకు మరింత బడ్జెట్‌ పెట్టి తీసుంటే ప్రొడక్షన్ వాల్యూస్‌ మరింత పెరిగి పెద్ద సినిమాల సరసన నిలిచి ఉండేదన్న అభిప్రాయం సినిమా వక్తల నుంచి ప్రధానంగా వినిపిస్తోంది. కాగా, ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్‌కి ఎలాంటి ఆర్‌ఆర్‌ కావాలో అంతలా ఇచ్చిపడేసి ఒళ్లు గగుర్పొడిచే మ్యూజిక్ అందించిన కేరళకు చెందిన సంగీత దర్శకుడు లిజో కె జోస్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

సినిమా బలాలు, బలహీనతలు విషయానికి వస్తే…ఒక సమీక్షకుడిగా ఈ సినిమాను.. చెడిపోతున్న యువత, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక అవేర్‌నెస్‌ తీసుకొచ్చే క్రమంలో తెరకెక్కించారు కాబట్టి..చిత్రంలో కొన్నికొన్ని చోట్ల లాజిక్‌ లేకుండా వచ్చే సీన్స్‌ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. వందల కోట్లు పెట్టి తీసే సినిమాల్లోనే లాజిక్‌ లేకుండా వచ్చే సీన్లను చూసి మన ఆహా ఓహో అంటున్నాం…ఇలాంటి పెద్ద కంటెంట్‌తో వచ్చిన ఈ చిన్నసినిమాను ఆదరించి మన భావితరాల భవిష్యుత్తును కాపాడుకుందాం అని పిలుపునివ్వడమే నా ఉద్దేశం.

గమనిక: ఈ మూవీ రివ్యూ సమీక్షకుడి అభిప్రాయ పరిధిలోని మాత్రమే)

రేటింగ్ 3/5

Hot this week

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...

Topics

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం: పవన్ కళ్యాణ్

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త...

‘మార్కో’ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ : ఉన్ని ముకుందన్

మార్కో' సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ....

‘తండేల్’ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అల్లు అరవింద్ ప్రెజెంట్స్, నాగ చైతన్య, సాయి పల్లవి, దేవి శ్రీ...