రోటీ కపడా రొమాన్స్‌: మూవీ రివ్యూ

Spread the love

మూవీ రివ్యూ – రోటీ కపడా రొమాన్స్‌

 

నలుగురు కుర్రాలు, నాలుగు జీవితాలు, నాలుగు ప్రేమ కథలు..అపార్థాలతో విడిపోయి అర్థమయ్యాక కలుసుకున్నదే ఈ చిత్ర కథ. ప్రతి మనిషి జీవితంలో ఒక ఆడది వస్తుంది, ఆమె వదిలివెళ్లిపోతే తనతో గడిపిన క్షణాలను తలచుకుంటూ అక్కడే ఆగిపోతావా, లేక ఆపై జీవితానికి మూవ్‌ ఆన్ అవుతావా…ఈ లైన్‌లో ఎక్కడా తడబాటు లేకుండా చక్కగా డిజైన్‌ చేసి ‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గరకు చేర్చారు మూవీ మేకర్స్‌.

 

 

కథ ..

 

విదేశాల్లో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్‌కు సడన్‌గా ఓ మెసేజ్ వస్తోంది. తమ నాలుగో ఫ్రెండ్‌ వారందరికీ టికెట్లు బుక్‌చేసిమరీ ‘రండ్రా మీ అందరినీ చూసి చాన్నాళ్లయిందని’ చెప్తాడు నాలుగో వాడు. అలా విదేశాల్లో ఉన్న ముగ్గురూ… గోవాలో ఉన్న తమ నాలుగో బెస్ట్ ఫ్రెండ్‌ని కలుసుకుని చిల్‌ అవుతూ గత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకుంటుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే…నలుగురి కుర్రాల ప్రేమకథలు చాలా భిన్నంగా ఉంటాయి. ఒకరి కథతో మరొకరి కథను ఇక్కడ పోల్చలేం. నలుగురిలో ఒకడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడి..అదే ఆఫీస్‌లో తన బాస్‌ ప్రేమను పొంది సాగే కథ ఒకరిది అయితే…ఓ ప్రముఖ ఎఫ్‌ఎం స్టేషన్‌లో రేడియో జాకీగా మంచి పేరు సంపాదించుకున్న కుర్రాడు, ఓ అభిమాని చూపించే ప్రేమకు బానిసైపోయి తన కెరీర్‌ను మలుపుతిప్పే స్టోరీ అతని సొంతం. ఇక, వన్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్‌గా లైఫ్‌లో ఒకరితోనైనా ఎంజాయ్‌ చేయాలంటూ కలలుగనే ఓ కుర్రదానికి…సైలెంట్‌గా ఉన్న ఓ కుర్రోడు దొరికితే ఎలాఉంటుంది…ఏమీ తెలియని ఆ అమాయకుడి జీవితంలో ఆమె రాకతో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది మరో కథ. ఇక, చివరిగా తెలంగాణ కుర్రోడి పాత్ర…ఇంట్లో అమ్మ గారాబం, నాన్న జేబుకు చిల్లు పెట్టాలంటే మనడో టాప్‌..అలాంటి కుర్రోడికి ఓ ఫంక్షన్‌లో ఎదురైన అమ్మాయిపైనే ప్రధానంగా ఫోకస్. వాస్తవానికి రోడ్‌సైడ్ రోమియోగా ఉండే మనోడు ఆ అమ్మాయి లక్ష్యాన్ని నెరవేర్చి తన ప్రేమను ఎప్పటికప్పడు చూపుతాడు. అయితే ఈ నలుగురి కథలు సుఖాంతంగా ముగిశాయా? ప్రేమించిన అమ్మాయిలని దూరంగా వదిలి ఆ ముగ్గురు కుర్రోళ్లు విదేశాలకు ఎందుకు వెళ్లిపోయారు? చాన్నాళ్ల తర్వాత ఇండియా వచ్చాక వారికి ఎదురైన అనుభవాలేంటి? అల్లరి చిల్లరిగా తిరిగే తెలంగాణ పోరడు…విదేశాల్లో ఉన్న ఫ్రెండ్స్‌కి టికెట్స్ వేసిమరీ గోవాకు రప్పించేంత స్టేజీకి ఎలా వెళ్తాడు? ఆద్యంతం హృద్యంగా సాగే సన్నివేశాలను మీ మదిలో చేరాలన్నా, పై ప్రశ్నలన్నటింకీ జవాబు దొరకాలన్నా తప్పక థియేటర్‌కు వెళ్లి ఆ నలుగురి కుర్రాళ్లని కలవాల్సిందే.

 

చిత్ర బలాబలాలు

 

1) తొలిసారి మెగాఫోన్ పట్టిన విక్రమ్‌రెడ్డి కథను తెరకెక్కించడంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ సాధించాడు.

2) ఇక హీరోలుగా హర్ష, సందీప్‌ సరోజ్, తరుణ్, సుప్రజ్‌…హీరోయిన్లుగా సోనూ ఠాకూర్‌, సువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి…తాము పాత్రలు పోషించారు అనడం కన్నా, జీవించారని చెప్పాలి. ఎక్కడా వర్థమాన నటులని తెలియలేదు, ఎంతో సీనియర్‌ ఆర్టిస్టులుగా చేసి ప్రేక్షకులను కట్టిపడేశారు.

3) ఇక ఈ చిత్రానికి సంగీతం మరో హైలెట్‌, చక్కటి బాణీలతో పాటలు, రీరికార్డింగ్ అదరగొట్టేలా ఉంది. మ్యూజిక్‌ డైరెక్టర్లుగా హర్షవర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధృవన్, వసంత్‌లు ఇచ్చిన మ్యూజిక్‌కి ఫిదా అవ్వాల్సిందే.

4) సన్నివేశాలకు తగ్గట్టుగా చక్కటి సంభాషణ, వాటిలో అలా వచ్చిపోయే కామెడీ టైమింగ్‌, సిచ్యువేషన్‌కు తగ్గట్టుగా ఎమోషన్ సీన్స్‌…ఆద్యంతం సీటులో కూర్చునే ప్రేక్షకుడి కళ్లు పక్కకు చూడకుండా చేశాయంటే చిత్రం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

5) చిత్రం ముగింపు ఎలా ఉంటుంది అనేదానిపై ప్రేక్షకుడిలో ఆద్యంతం ఉత్కంఠం కలిగించిన మన డైరెక్టర్‌…ఎండ్‌ కార్డు పడేసరికి ఇచ్చేపడేశాడు. ఇలాంటి ఎండింగ్ ఏ మూవీలోనూ చూడలేదన్న ఫీలింగ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

 

చిత్ర బలహీనతలు

 

1) సినిమా పరంగా మాంచి పాజిటివ్ టాక్‌ ఉన్నా కూడా టైటిల్ విషయంలో మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రజానీకానికి తప్ప మిగతా ఏరియాల్లో ‘రోటీ కపడా రొమాన్స్‌’ టైటిల్ చేరుకోలేకపోవచ్చన్నది క్రిటిక్స్ చెబుతున్న మాట.

2) చిన్నసినిమాకు థియేటర్లు అంతగా దొరకవు అనే నానుడి ఉంది, మొన్నటికి మొన్న విడుదలైన కమిటీ కుర్రోళ్ల చిత్రానికి కూడా థియేటర్లు లేక చాలామంది ఆడియన్స్‌కి ఇన్‌టైమ్‌లో రీచ్‌ కాలేకపోయింది, ఆ మూవీలాగే ఈ చిత్రానికి కూడా ఎదురైతే ఎంత మంచి సినిమా అయినా కమర్షియల్‌గా నాలుగు డబ్బులు సంపాదించలేని పరిస్థితి ఏర్పడుతుంది.

3) చిన్న సినిమాలకు గట్టిగా ప్రమోషన్స్ ఉండాలి, ఈ చిత్రానికి ప్రమోషన్స్ విషయంలో మైనస్‌గా చెప్పొచ్చు. అందరి ప్రేక్షకులకు దగ్గరవ్వాలంటే బలమైన ప్రమోషన్స్‌తో ముందుకెళ్లాలి. ఒకవేళ అలా లేకుంటే కూడా సినిమాకు మైనస్‌ అనేది విశ్లేషకుల మాట. ఉదాహరణకే చూసుకుంటే కమిటీకుర్రోళ్ల చిత్రానికి అన్ని దగ్గరుండి  నిహారిక కొణిదెల చూసుకున్నారు కాబట్టే ఆ చిత్రం అంతటి ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచిందని కూడా గుర్తుచేస్తున్నారు.

 

(గమనిక – ఈ చిత్ర సమీక్ష ప్రేక్షకుడి అభిప్రాయపరిధిలోనిది మాత్రమే)

 

(రేటింగ్‌ *** 3/5)

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...