టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు సోమవారం తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు సెయింట్ లూసియాలోని డారెన్ సామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే, సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.
మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు