తండ్రి అయిన కెప్టెన్ హిట్‌మ్యాన్..!
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ భార్య..!
త్వరలో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గుడ్‌న్యూస్ విన్నాడు. తాను పండంటి బిడ్డకు తండ్రి అయ్యాడు. రోహిత్ శర్మ భార్య రితికా శుక్రవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో, రోహిత్ దంపతులకు రెండవ సంతానం కాగా… మొదటిబిడ్డగా కూతురు సమైరా పుట్టిన విషయం తెలిసిందే.
భార్య రితికా గర్భిణిగా ఉన్న టైమ్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ మిగతా ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. దీంతో పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు హిట్‌మ్యాన్ ఆడేది కష్టమేనంటూ వార్తలు వచ్చాయి. అయితే భార్య డెలివరీ పూర్తవడంతో, టీమిండియాతో రోహిత్ కలిసే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ 22 నుంచి జరగనున్న తొలి టెస్టులో కూడా ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 7 టెస్టు మ్యాచ్‌లు ఆడి ఆస్ట్రేలియా పిచ్‌లపై గట్టి పట్టు సాధించిన రోహిత్…నవంబర్ 22నుంచి జరిగే తొలి టెస్ట్‌మ్యాచ్ నుంచి అందుబాటులో ఉంటే ఆ కిక్కే వేరంటూ ఫ్యాన్స్, క్రిటిక్స్ ఎవరికివారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.