డీఎస్పీగా క్రికెటర్ సిరాజ్..!
టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్ట్ కేటాయించారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ నియామక పత్రాన్ని సిరాజ్‌కు అందించారు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం సిరాజ్‌కు ఇంటి స్థలం , ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 78లో 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు, ప్రభుత్ ఉద్యోగం ఇవ్వాలన్న నిర్ణయం ప్రకారం తాజాగా సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు కేటాయించడం గమనార్హం.
భారతీయ జట్టులో ఫాస్ట్ బౌలర్‌గా పేరొందిన మహ్మద్ సిరాజ్ మన హైదరాబాదీనే. 1994, మార్చి 13న జన్మించాడు. తండ్రి మహ్మద్ గౌస్ ఆటో డ్రైవర్. సిరాజ్ అన్నయ్య ఇస్మాయిల్ ఇంజనీర్. రంజీ నుంచి ప్రారంభమై ఇంటర్నేషనల్ క్రికెటర్ స్థాయికి ఎదిగిన సిరాజ్ ప్రస్థానం వర్ధమాన, ఔత్సాహిక క్రికెటర్లకు నిజంగా మార్గదర్శనం అంటారూ క్రిటిక్స్. ఒక ఓవర్‌లో 4 వికెట్లు తీసిన మొదటి భారతీయుడు మన హైదరాబాదీ సిరాజ్ కావడం మనందరకి గర్వకారణం.