విరాట్ కోహ్లీకి భక్తి భావం కూడా ఎక్కువే. దీనికి నిదర్శనం తాజాగా కోహ్లీ ఫోన్ వాల్‌పేపర్‌గా ఓ ఆధ్యాత్మిక గురువు, కొంతమంది సాక్షాత్తు దైవస్వరూపంగా భావించే ‘నీమ్ కరోలీ బాబా’ ఫొటో ఉండటమే. భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచి.. గురువారం స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా.. ముంబైలో విక్టరీ పరేడ్ నిర్వహించారు. అనంతరం టీమిండియాను వాంఖడే స్టేడియంలో ఘనంగా సన్మానించారు.
ఇక ఈ వేడుక ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ తన భార్య, పిల్లలను కలవడానికి లండన్ వెళ్లిపోయాడు. లండన్ విమానాశ్రయంలో దిగిన తర్వాత తన డ్రైవర్‌కు గుడ్‌బై చెప్పే సమయంలోనే విరాట్ కోహ్లీ ఫోన్ వాల్‌పేపర్ మీడియా కంట పడింది.