శ్రీలంక ప్రధాన హెడ్‌కోచ్‌గా జయసూర్య..!
శ్రీలంక పురుషుల జట్టుకు ప్రధాన హెడ్‌కోచ్‌గా మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య నియమితులయ్యారు. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌పై శ్రీలంక జట్టు అద్భతమైన ప్రదర్శన కబపరచడంతో తాత్కాలిక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జయసూర్యను పూర్తిస్థాయిలో నియమింపబడ్డారు. ఆయన్ను మెన్స్ టీమ్ హెడ్‌కోచ్‌గా శ్రీలంక ఎగ్జిక్యూటీవ్ టీమ్ నిర్ణయం తీసుకుంది. హెడ్‌కోచ్‌గా జయసూర్య పదవీకాలం 2024, అక్టోబర్ 1నుంచి ప్రారంభమై…2026, మార్చి 31వరకు కొనసాగుతుంది.
చదవండి: టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో ఎవరు..?
హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక జట్టు లక్ష్యాలను… బోర్డు తన ముందుంచింది. త్వరలో వెస్టిండీస్‌తో జరిగే దంబుల్లా, పల్లెకెలెలో జరిగే పరిమిత ఓవర్ల మ్యాచులు శ్రీలంక హెడ్‌కోచ్‌గా జయసూర్య పనితీరుకు పట్టం కట్టబోతున్నాయి.
గడిచిన 27ఏళ్లలో జయసూర్య గైడెన్స్‌లో భారత్‌తో శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ గెలుచుకుంది. అలాగే, గడిచిన పదేళ్లలో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ గెలిచి విజయఢంకా మోగించింది. ఇటీవల స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్‌తో టెస్ట్‌లోనూ సత్తాచాటి 2-0 తేడాతో కప్ ఎగరేసుకుపోయింది.
1991 నుంచి 2007 వరకు ఎడమచేతివాటమైన జయసూర్య 110 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 14 సెంచరీలు, 31 అర్థసెంచరీలు చేశాడు. అతని కెరీర్‌లో మొత్తం 6,973 పరుగులు చేశాడు. ఇక…వన్డేల విషయానికి వస్తే 445 వన్డేలు ఆడి 28 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో జయసూర్య 13,430 పరుగులు. చేశాడు. 1996 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక విజయంలో కీలకపాత్ర పోషించాడు.