టాలీవుడ్ డ్రగ్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్, తరుణ్. ఈ కేసులో ఛార్మీ, నవదీప్, తనీష్ వంటి వారు కూడా ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లాల్సివచ్చింది. వీరంతా తమ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. ఆ శాంపిల్స్ ను తెలంగాణ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో టెస్టులకు పంపారు. వీరిలో తరుణ్, పూరి జగన్నాథ్ టెస్ట్ ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి.
ఆ శాంపిల్స్ లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో తరుణ్, పూరి జగన్నాథ్ ఎలాంటి డ్రగ్స్ ఉపయోగించలేదని తేలింది. డ్రగ్ కేసు నుంచి వీరిద్దరికి ఉపశమనం లభించినట్లే అనుకోవాలి. టెస్టుల రిపోర్టుల బట్టి డ్రగ్ కేసులో వీరి ప్రమేయం లేదంటూ కోర్టు పేర్కొంది. పూరి, తరుణ్ పై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ ఫొరెన్సిక్ టెస్టుల్లో మరికొందరు ఆర్టిస్టుల ఫలితాలు రావాల్సిఉంది.