కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికో హత్యాచార ఘటన మరవకముందే దేశవ్యాప్తంగా అప్పుడే పలుచోట్ల లైంగిక దాడులు, ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. ఇది ప్రస్తుత పరిస్థితిలో కాస్త ఆందోళన కలిగించే పరిణామం. మహారాష్ట్ర థానేలోని ఓ స్కూల్‌లో మూడేళ్ల వయస్సు కలిగిన ఇద్దరు బాలికలపై…స్కూల్ క్లీనింగ్ సిబ్బంది ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
నిందితుడు అక్షయ్ షిండే అరెస్ట్…!
ఆగస్ట్ 12-13 తేదీల్లో చిన్నారులపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. థానే జిల్లా బద్లాపూర్‌లోని ఓ స్కూల్‌లో… వాష్‌రూంకు వెళ్లిన ఇద్దరి బాలికలను లైంగికంగా వేధించడంతో నిందితుడు అక్షయ్ షిండేపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా…ధర్మాసనం మూడ్రోజులపాటు పోలీసు కస్టడీ విధించింది.
పోలీసు అధికారుల నిర్లక్ష్యం..?
బాధ్యులు సస్పెన్షన్..
తమ పిల్లలపై లైంగిక దాడి జరిగిందని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా…ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా జాప్యంచేశారని పోలీస్ ఇన్‌స్పెక్టర్ శుభద షిటోలెపై బాధిత తల్లితండ్రులు, స్ధానికులు ఆరోపించారు. అయితే ఓ దశలో బద్లాపూర్‌లో నిరసన జ్వాల ఎగసిపడటంతో…ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, సంబంధిత సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు.