వైసీపీకి రాజీనామాల పర్వం..!
MLC పోతుల సునీత బాటలో మరో ఇద్దరు..?
వైఎస్‌ఆర్సీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. రోజుకో నేత పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అన్న హోదాతో పనిలేకుండా ఇటు పదవులకు, పార్టీ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పేస్తున్నారు…రెండ్రోజుల వ్యవధిలో చూసుకుంటే ఎమ్మెల్సీ పోతుల సునీతతోపాటు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు వైఎస్ఆర్సీపీని వదిలివెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఇదే బాటలో మరో ఇద్దరు శుక్రవారం జగన్ పార్టీ కండువాలను వదిలేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారట. పదవులతోపాటు పార్టీ సభ్యత్వాలను వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నారట.
చదవండి: నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ కు వచ్చేసిన ‘శివం భజే’
రాజీలేని రాజీనామాలు..!
ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్‌సీపీలో రాజీనామాలపర్వం కొనసాగుతోంది. గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరితో మొదలైన రాజీనామాస్త్రం…. క్రమక్రమంగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, మాజీ మంత్రి ఆళ్లనాని ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రవిలు రాజీనామాలు చేశారు. అంతేకాదు, పలుచోట్ల మేయర్లు, కార్పొరేటర్లు కూడా జగన్‌కు గుడ్‌బై చెప్పేసి అధికార పార్టీలోకి వచ్చేసిన సంగతీ తెలిసిందే. పరిస్థితి ఇలానే కొనసాగితే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ రేపో,మాపో వదిలేసే పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.